BREAKING: తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. స్థానిక హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తరలించారు.

New Update
BREAKING: తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు

Tammineni Veerabhadram: సీపీఎం (CPI) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మంలోని తన నివాసంలో ఉన్నప్పుడే గుండెపోటు వచ్చినట్లు వారు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కుటుంబసభ్యులు తరలించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు (Paleru) నుంచి పోటీ చేసి ఓడిపోయారు తమ్మినేని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.

ఢిల్లీలో దోస్తీ.. రాష్ట్రంలో కుస్తీ..

ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సీపీఎం పార్టీ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) సీపీఐ, సీపీఎం పార్టీలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరగా సీపీఐ తమ మద్దతును కాంగ్రెస్ కు ప్రకటించింది. సీపీఎం మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. సీట్ల పంపకం విషయంలో ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో సీపీఎం పార్టీ తెలంగాణ అసెంబ్లీలో ఒంటరిగా పోటీలో దిగింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తమ్మినేని వీరభద్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు గెలిచి అసెంబ్లీలో కుర్చీ సంపాదించుకున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన సీపీఎం ఫలితాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిసి తమ మద్దతును ప్రకటించింది. ఎంపీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తామని సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు.

ALSO READ: ‘నిన్ను లేపేస్తాం’..ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు