Sitaram Echuri: వెంటిలేటర్‌ పై సీతారాం ఏచూరి..పరిస్థితి విషమం!

సీపీఐ (ఎం) సీనియర్‌ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు.ఢిల్లీ ఎయిమ్స్‌ లో వెంటిలేటర్‌ పై ఉంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Sitaram Echuri: వెంటిలేటర్‌ పై సీతారాం ఏచూరి..పరిస్థితి విషమం!
New Update

Sitaram Echuri: సీపీఐ (ఎం) సీనియర్‌ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్‌ లో వెంటిలేటర్‌ పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సీతారాం ఏచూరి వయసు 72 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆగస్టు 19నే ఆయన ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేరారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని హాస్పిటల్ వర్గాలు వివరించాయి.. న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్‌తో ఆయన బాధపడుతున్నారని సమాచారం. అయితే చికిత్సకు సంబంధించిన వివరాలను హాస్పిటల్ ఇంకా ప్రకటించలేదు.

మరోవైపు ఇటీవలే ఆయన కంటికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. సీతారాం ఏచూరీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆగస్టు 31నే సీపీఐ(ఎం) పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చికిత్స పొందుతున్నారని ప్రకటన విడుదల చేసింది.

Also Read: ఏపీకి మరోసారి వానగండం..భారీ వర్షాలు కురిసే అవకాశాలు!

#delhi-aiims #sitaram-echuri
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe