తులసివనంలో గంజాయ్ మొక్క పువ్వాడ అజయ్..సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్ ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తులసివనంలో గంజాయ్ మొక్క మంత్రి పువ్వాడ అని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. By Jyoshna Sappogula 24 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి CPI Narayana: సీపీఐ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జాతీయ కార్యదర్శి నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తులసివనంలో గంజాయ్ మొక్క మంత్రి పువ్వాడ అజయ్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి పువ్వాడ తన తండ్రికి మచ్చ తెచ్చాడన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. Also Read: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ ఖమ్మం నియోజకవర్గంలో పొత్తు ధర్మాన్ని పాటించడం లేదన్న అపవాద తమపై ఉందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేస్తామని మాట ఇచ్చారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్, సీపీఐకి ఓటెయ్యండి.. దేశాన్ని గెలిపించండని కోరారు సీపీఐ నారాయణ. నిన్న మొన్నటి దాకా పాలసీ కమిటీ చైర్మన్ గా ఉన్న వివేక్ కాంగ్రెస్ లో చేరగానే బీజేపీ దాడులు జరిపించిందని ఆరోపించారు. కక్ష్యసాధింపు చర్యలకు బీజేపీ, బీఆర్ఎస్ తెరలేపిందని విమర్శలు గుప్పించారు. కర్ణాటక కాంగ్రెస్ విజయం తెలంగాణపై ప్రభావం చూపినట్లే తెలంగాణ విజయం ఏపీలో ప్రభావం చూపుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ పై కౌంటర్లు వేశారు. స్వాతంత్రం వచ్చాక అత్యధిక రోజూలు బెయిల్ పై బయట ఉన్న ఏకైక వ్యక్తి జగన్ అని వ్యాఖ్యనించారు. ఏపీలో బీజేపీని వదిలేస్తే టీడీపీ జనసేనతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని తెలిపారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని బీజేపీ, ఎంఐఎం పార్టీలు భావిస్తున్నాయని మండిపడ్డారు. #telangana-elections-2023 #minister-puvvada-ajay #cpi-narayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి