CPI Narayana: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి బీజేపీ మైండ్ గేమ్ ఆడుతుందని ఫైర్ అయ్యారు సీపీఐ నేత నారాయణ. ఈసారి కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని పేర్కొన్నారు. కేంద్రంలో, ఏపీలో ప్రభుత్వాలు మారబోతున్నాయని జోస్యం చెప్పారు.

New Update
CPI Narayana: కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఓడిపోతాయి.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు

CPI Narayana: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీలో జరుగుతున్న అల్లర్లపై ఘాటు స్పందించారు సీపీఐ నేత నారాయణ. జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పి మైండ్ గేమ్ ఆడుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని పేర్కొన్నారు. మెజారిటీ స్థానాల్లో ఇండియా కూటమి నేతలే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి దేశంలో 150 ఎంపీ స్థానాల్లో గెలవడం కష్టమని అన్నారు.

ఏపీలో కూడా ఈసారి ఎన్నికల్లో సీఎం జగన్ పార్టీ ఓడిపోతుందని.. అటు కేంద్రంలో.. ఇటు ఏపీలో కూడా ప్రభుత్వాలు మారబోతున్నాయని జోస్యం చెప్పారు. న్యాయవ్యవస్థను, తెలుగు ప్రజలను మాజీ సీజే వెంకటరమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నాశనం చేశారని ఫైర్ అయ్యారు. 97 శాతం రాజకీయాలు డబ్బుతో నడుస్తున్నాయని అన్నారు. పోలీసుల వైఫల్యాల వల్లే ఏపీలో అల్లర్లు జరిగాయని మండిపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు