Vijayawada CP Rajasekhar Babu Saved 10 Days Old Baby : విజయవాడ (Vijayawada) లోని చాలా ప్రాంతాలు వరద నీటిలో నానుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఇతర పోలీసు సిబ్బంది తో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పది రోజుల పసిపాపను రక్షించి పునరావాసా కేంద్రానికి తరలించారు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖర్ బాబు.
వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ.. ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) మరియు ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు, ఫైర్ మరియు పోలీసు లా అండ్ ఆర్డర్ అధికారులు.. సిబ్బంది సహకారంతో లోతట్టు ప్రాంతాలలో సహాయక చర్యలతో నీట మునిగిన ప్రాంతాల నుండి ప్రజలను రక్షించి పునరావాసాలకు తరలించేందుకు సీపీ చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలోనే రెండో రోజు సింగ్ నగర్, నున్న పరిసర ప్రాంతాలతో పాటు ఇబ్రహీం పట్నం ఏరియాలలోని నీట మునిగిన ప్రాంతాల్లోకి స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న 10నెలల బాలికను.. వారి కుటుంబ సభ్యులను బోట్ సహాయంతో స్వయంగా బయటకు తీసుకువచ్చారు.
భవానీపురం, చిట్టీనగర్ మరియు వై.ఎస్.ఆర్ కాలనీ ఏరియాలలోని నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి.. వారికి అందుతున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకుని అధికారులకు సీపీ తగు సూచనలు చేశారు.
Also Read: ఆ జిల్లాలో విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు