Corona Alert: కరోనాతో కేంద్రం అలెర్ట్.. రాష్ట్రాలకు కోవిడ్ అడ్వైజరీ జారీ!

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రాలకు కోవిడ్‌ అడ్వైజరీ జారీ చేసింది. రాష్ట్రాల వారీగా ఎస్ఏఆర్ఐ, ఐఎల్ఐ కేసులను ఎప్పటికప్పుడు రిపోర్టు చేసి పర్యవేక్షించాలని చెప్పింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది.

Telangana Corona Updates: తెలంగాణలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు..
New Update

దేశంలో కరోనా మరోసారి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. కరోనా కేసులు అమాంతం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం దేశంలో సోమవారం 260 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, క్రియాశీల కేసులు 1,828 కు పెరిగాయి. అటు ఇటీవల కరోనా వైరస్‌కు చెందిన జెఎన్.1 సబ్‌వెరియంట్‌ కనుగొనబడిన కేరళలో ఒక మరణం నమోదైంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇటీవల కోవిడ్ కేసులు పెరగడం కొత్త సబ్‌వెరియంట్‌కు సంబంధించిన మొదటి కేసును గుర్తించడంతో మహమ్మారిపై పోరాటాన్ని మళ్లీ స్టార్ట్ చేయాలని కేంద్రం భావిస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాంష్ పంత్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

publive-image రాష్ట్రాలకు కోవిడ్‌ అడ్వైజరీ జారీ

కేంద్రం ఏం చెప్పిందంటే?
ఇటీవల కోవిడ్-19 కేసులు పెరగడం, భారత్‌లో జేఎన్.1 వేరియంట్ తొలి కేసును గుర్తించడంతో రాష్ట్రాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది. కోవిడ్ పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలు కోరింది. రాష్ట్రాల వారీగా ఎస్ఏఆర్ఐ, ఐఎల్ఐ కేసులను ఎప్పటికప్పుడు రిపోర్టు చేసి పర్యవేక్షించాలని చెప్పింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పాజిటివ్ నమూనాలను ఇన్సాకోగ్ ప్రయోగశాలలకు పంపాలని తెలిపింది. దీనివల్ల దేశంలో పుట్టుకొచ్చే కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించేందుకు వీలవుతుంది.

డిసెంబర్‌లో పెరుగుతున్న కేసులు:
ఇక ఈ డిసెంబర్‌లో కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. నవంబర్‌లో 470 కేసులు ఉండగా.. డిసెంబర్ మొదటి పది రోజుల్లోనే 825 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఈ కొత్త వేరియంట్ కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. శ్వాస సంబందిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగులకు కోవిడ్ సోకినట్లు గుర్తించామని వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ జేఎన్1 సబ్ వేరియంట్‌ని దక్షిణాది రాష్ట్రం గుర్తించినట్లు నివేదికలు ఉన్నప్పటికీ వైరస్ పై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులు స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభావిత ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం ఆంక్షలు, నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటు కర్ణాటక ప్రభుత్వం మాస్క్‌ తప్పనిసరి చేస్తూ రూల్స్‌ పాస్ చేసింది.

Also Read: కేజ్రీవాల్‌కు బిగ్‌ షాక్‌.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లు

WATCH:

#corona #covid-19
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe