Tamilnadu: దూసుకొచ్చిన కుర్తాళం జలపాతం... బాలుడి గల్లంతు!

తమిళనాడులోని తేన్‌ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం అయిన కుర్తాళం వద్ద ఒక్కసారిగా వరదలు ముంచుకొచ్చాయి. ఈ వరదల్లో 17 ఏళ్ల బాలుడు కొట్టుకుపోయాడు.

Tamilnadu: దూసుకొచ్చిన కుర్తాళం జలపాతం... బాలుడి గల్లంతు!
New Update

Tamilnadu Courtallam Waterfalls Incident: తమిళనాడులోని తేన్‌ కాశీ జిల్లాలో పశ్చిమ కనుమల వద్ద కొలువుదీరిన పుణ్యక్షేత్రం అయిన కుర్తాళం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడి జలపాతం ఇక్కడికి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే గత ఐదు రోజులుగా విస్తారంగా ఇక్కడు వర్షాలు భారీగా పడుతున్నాయి.

ఎప్పటి లాగానే పర్యాటకులు కుర్తాళం జలపాతం వద్దకు ఈరోజు కూడా వచ్చారు. అయితే కేవలం రెప్పపాటు వ్యవధిలో మెరుపు వరదలు ముంచెత్తాయి. అంతా చూస్తుండగానే నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉద్ధృతంగా మారింది. దాంతో పర్యాటకులు హడలిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కుర్తాళం జలపాతం భయానక రూపుదాల్చిన నేపథ్యంలో, అశ్విన్ అనే ఓ 17 ఏళ్ల కుర్రాడు గల్లంతయ్యాడు. ఆ బాలుడు పాలయంకొట్టై ప్రాంతంలోని ఎన్జీవో కాలనీకి చెందినవాడిగా గుర్తించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ వెంటనే స్పందించి కుర్తాళం జలపాతం వద్దకు చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే అశ్విన్ మృతదేహం జలపాతం నుంచి అరకిలోమీటరు దూరంలో కొండరాళ్ల మధ్య చిక్కుకుని దొరికింది.

Also read: గ్రూప్‌-4 అభ్యర్థులకు అలర్ట్.. !

#rains #kurtlam #tamilanadu #floods
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe