KCR: కేసీఆర్ మరోసారి షాక్ తప్పదా?

TG: నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు లేదా సోమవారం తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.

KCR: కేసీఆర్ మరోసారి షాక్ తప్పదా?
New Update

KCR: విద్యుత్ కొనుగోళ్ల కేసులో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం, కేసీఆర్ తరఫున న్యాయవాదుల వాదన విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు లేదా సోమవారం తీర్పును వెలువరించనుంది. కాగా కేసీఆర్ వేసిన పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఒకవేళ కేసీఆర్ అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే రేవంత్ సర్కార్ కు ఇది పేద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే కేసీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైనట్లే అని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. మరి కేసీఆర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.

#kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe