Bholaa Shankar : భోళా శంకర్ రిలీజ్ కు పెద్ద చిక్కు వచ్చి పడిందే..కోర్టుకెక్కిన డిస్ట్రిబ్యూటర్! మరో రెండు రోజుల్లో మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపేందుకు రాబోతున్న భోళా శంకర్ సినిమాకు చుక్కెదురైంది. ఆగస్టు 11 న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. అంతే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చిరంజీవితో పాటు హీరోయిన్లు కూడా మొదలు పెట్టారు. By Bhavana 09 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి Petition Filed on Chiranjeevi Bholaa Shankar: మరో రెండు రోజుల్లో మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపేందుకు రాబోతున్న భోళా శంకర్ సినిమాకు చుక్కెదురైంది. ఆగస్టు 11 న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. అంతే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చిరంజీవితో పాటు హీరోయిన్లు కూడా మొదలు పెట్టారు. అంతా బాగుంది..సవ్యంగా జరుగుతుంది అనుకున్న సమయంలో మూవీకి ఓ అడ్డం వచ్చి పడింది. అది కూడా అఖిల్ ఏజెంట్ మూవీ రూపంలో .అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిన విషయమే. సినిమాలు డిజాస్టర్ అయితే రికవరీ లు అందచేస్తూంటారు నిర్మాతలు. అయితే ఆ రికవరీల విషయం లోనూ వివాదాలు వస్తే ..కోర్టులకు వెళ్తూంటారు. ఈ మేరకు #Agent వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఈ మేరకు తాము కోర్టుకు వెళ్లిన విషయాన్ని స్పష్టం చేసారు. AK ఎంటర్టైన్మెంట్స్ వారు 30 కోట్లు తీసుకుని మోసగించారు అంటూ తెలియచేసారు. ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్) ఆరోపించారు. ఆ మేరకు బుధవారం తనకు జరిగిన అన్యాయంపై ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. "ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ నన్ను మోసం చేయడంతో వారి నిజ స్వరూపం బట్టబయలు అయింది. వారు చేసిన అన్యాయం ఏమిటో ప్రతీ ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏప్రిల్ ఆఖరులో విడుదలైన "ఏజెంట్" సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు నాకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసి ఇచ్చి,, 30 కోట్ల రూపాయలు తీసుకుని మరీ వారు నన్ను మోసం చేశారు. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను విడుదల సమయంలో కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే అందజేసి, అగ్రిమెంట్ కు తూట్లు పొడిచారు. ఆ తర్వాత మే 1వ తేదీన హైదరాబాద్ లోని వారి ఆఫీస్ కు వెళ్లి గరికపాటి కృష్ణ కిషోర్ ను కలవడం జరిగింది. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఈ విషయం పై నిర్మాతలను ప్రశ్నించగా.. “సామజవరగమన” చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కులను విశాఖపట్నం వరకు ఇచ్చారు. అయితే దాని నుంచి కూడా కొద్ది డబ్బు మాత్రమే నాకు కవర్ అయ్యింది. ఈ నేపథ్యంలో 45 రోజుల్లో నాకు రావలసిన మిగతా డబ్బును చెల్లిస్తామని, ఒకవేళ అలా చెల్లించకపోతే తమ తదుపరి సినిమా విడుదల లోపు ఇస్తానని నాకు ఒప్పంద పత్రం చేశారు. అయితే వారి తదుపరి సినిమా "భోళా శంకర్" అయ్యింది. అయితే ఇప్పుడు ఎ.కె. ఎంటర్ టైన్మెంట్స్ వారు నా దగ్గర 30 కోట్లు. తీసుకుని, సరిగ్గా సమాధానం చెప్పకుండా, ఎగొట్టాలనే తలంపుతో ఆఖరికి నా మీద ఫోర్టరీ చేశాననే నింద కూడా వేశారు. వాస్తవానికి ఆ మధ్య యూరోస్ ఇంటర్నేషనల్ వారికి వీరు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ కావడంతో వీరిపై ఆ సంస్థ కేసులు కూడా పెట్టింది. అలాగే ఎంతోమందిని మోసం చేస్తూ, వీరు తమ గుడ్ విల్ ను పోగొట్టుకున్నారు.. ఇంకా ఎంతోమందికి వీరు బాకీలు ఉన్నారు. నా నీతి, నిజాయితీ ఏమిటో సినీ పరిశ్రమతో పాటు అందరికీ తెలుసు. నాకు సరైన సమాధానం చెప్పకుండా వారి చుట్టూ తిప్పించుకుండటం వల్లే నేను ఈ రోజు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సహనం చచ్చిపోయి AK ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న భోళా శంకర్ రిలీజ్ పై కేసు వేసినట్లు వెల్లడించారు. మరి దీని పై కోర్ట్ ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి. Also Read: ‘బిగ్ బాస్-7’లోకి నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. అత్తతో రచ్చ చేస్తాడా? #chiranjeevi #bhola-sankar #bhola-shankar-controversy #court-case #release-date #petition-filed-on-chiranjeevi-bhola-shankar #bhola-shankar-release-date #petition-filed-on-chiranjeevi-bholaa-shankar #chiranjeevi-bholaa-shankar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి