BRS Leader Krishank: క్రిశాంక్‌ను పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు TG: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో క్రిశాంక్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో రేపు క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. By V.J Reddy 04 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS Social Media Incharge Krishank: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను ఒక రోజు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో క్రిశాంక్ ఉన్నాడు. ఈ నేపథ్యంలో రేపు క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. Court orders one day police custody to Krishank. @SarveySuhasini is worried about her husband’s safety & raised several doubts over the case. Says “In the custody - the court didn’t permit - CCTV or advocate.? What is the need for police custody when the entire case is out… https://t.co/JjjougIIBm pic.twitter.com/M1NdFROG5U — Naveena (@TheNaveena) May 4, 2024 అసలేమైంది.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ క్రిశాంక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తుండగా పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారంటూ క్రిశాంక్ ట్వీట్ చేశారు. తన కారు ముందుసీటులో సీఐ కూర్చున్న ఫోటో ను క్రిశాంక్ షేర్ చేశారు. పోలీసులు తనను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియడం లేదని క్రిశాంక్ పేర్కొన్నారు. క్రిశాంక్‌పై హైదరాబాద్‌లో పోలీసు కేసు నమోదు చేశారు. ఓయూలో కరెంట్, వాటర్ సమస్య వల్లే హాస్టల్స్ క్లోజ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశాడంటూ క్రిశాంక్ పై కేసు నమోదైంది. ఇంకా ఫేక్ ప్రకటనలు పోస్ట్ చేశారని కూడా ఆయనపై పోలీసులు అభియోగాలు మోపినట్లు సమాచారం. ఓయూ చీఫ్ వార్డెన్ ఫిర్యాదుతో క్రిశాంక్‌పై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయంలోనే క్రిశాంక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. #krishank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి