Hyderabad: బోడుప్పల్‌లో దొంగనోట్ల ముద్రణ.. ఆ వెబ్‌సిరీస్‌ చూసి ఇన్‌స్పైర్

బోడుప్పల్‌లో దొంగనోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ కు చెందిన లక్ష్మీ నారాయణ, ప్రణయ్ కుమార్ లు జగద్గిరిగుట్ట దగ్గర రూ.4 లక్షల నకిలీ నోట్లతో పట్టుబడ్డారు. ఓ వెబ్ సిరీస్ 150సార్లు చూసి స్ఫూర్తి పొందినట్లు నిందితులు చెప్పడం విశేషం.

Hyderabad: బోడుప్పల్‌లో దొంగనోట్ల ముద్రణ.. ఆ వెబ్‌సిరీస్‌ చూసి ఇన్‌స్పైర్
New Update

Counterfeit notes: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) దొంగ నోట్లు ముద్రణ కేసు సంచలనం రేపింది. ఇంటర్నెట్ లో మెలుకువలు నేర్చుకుని లక్షల సంఖ్యలో కరెన్సీ (Currency) ముద్రించి మిత్రుడి సాయంతో చలామణి చేస్తుండగా అనూహ్యంగా శనివారం అల్లాపూర్‌ పోలీసులకు చిక్కారు. నిందితులు చెప్పిన వివరాలు విని పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో..
ఈ మేరకు అల్లాపూర్‌ సీఐ శ్రీపతి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లాకు చెందిన వనం లక్ష్మీనారాయణ(37) కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి బోడుప్పల్‌లోని మారుతీనగర్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నారాయణ గతంలో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇతనికి వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి ఎరుకల ప్రణయ్‌కుమార్‌(26) అనే మిత్రుడు ఉన్నాడు. ఇటీవల తన ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో లక్ష్మీనారాయణ దొంగ నోట్ల తయారీ మొదలుపెట్టాడు. ఓటీటీలో ఉన్న ఓ బాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌ సినిమా చూసి స్ఫూర్తి పొందినట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే రెండు నెలల్లో ఏకంగా ఆ సిరీస్‌ను 150 సార్లు చూసిన నారాయణ.. దొంగనోట్లకు అవసరమైన సామగ్రిని సేకరించి ముద్రన ప్రారంభించాడు.

ఇది కూడా చదవండి : Sucide: భువనగిరిలో దారుణం.. హస్టల్ లో ఉరేసుకున్న పదో తరగతి విద్యార్థినిలు

విడతలవారిగా ముద్రణ..
మొదటి విడతగా రూ.3 లక్షలు (రూ.500 నోట్లు) ముద్రించాడు. ఒప్పందం చేసుకున్న వాటా ప్రకారం మిత్రుడు ప్రణయ్‌కుమార్‌ సహాయంతో జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో చలామణి చేయించాడు. మొదటి ప్రయత్నం సక్సెస్ కావడంతో రెండోసారి రూ.4.05 లక్షల దొంగ నోట్లను ముద్రించాడు. అయితే శనివారం బాలానగర్‌ ఎస్‌ఓటీ, అల్లాపూర్‌ పోలీసులు శనివారం ఉదయం తనిఖీలు చేస్తుండగా.. ఈ ఇద్దరు అనుమానాస్పదంగా కంటపడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని సోదాచేయగా రూ.500 నోట్లు(రూ.4.05 లక్షలు) నిందితుల దగ్గర దొరికినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఉప్పల్‌లోని లక్ష్మీనారాయణ ఇంట్లో సోదా చేయగా ప్రింటర్‌, ల్యాప్‌ట్యాప్‌, ముద్రణ సామగ్రి లభించినట్లు చెప్పిన పోలీసులు.. ముద్రణ గదిలోకి ఎవరూ రాకుండా తాళం వేసి ఉంచినట్లు తెలిపారు. ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపరిచారు.

#hyderabad #counterfeit-notes #vanam-lakshminarayana #erukala-pranaykumar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe