Telangana Corona Updates: తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా బుధవారం 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ మొత్తం 538 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. వీరిలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 కేసులు నమోదవగా.. ఇవాళ ఒకరు రికవరీ అయ్యారు. వీరిలో 14 మంది ఐసోలేషన్ చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. కాగా, మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు చూసుకుంటే.. 8,44,513 పాజిటివ్ నమోదయ్యాయి. వీరిలో 8,40,388 రికవర్ అయ్యారు. 4,111 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ రేటు 0.49 శాతం ఉంటే.. రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,91,72,240 శాంపిల్స్ పరీక్షించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ అలర్ట్ అయ్యింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. జన సమూహాల్లో వెళ్ల కూడదని, డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని సూచనలు జారీ చేసింది ప్రభుత్వం.
ఇక పోతే దేశ వ్యాప్తంగానూ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో మొత్తం 341 కొత్త కరోనా కేసులు నమోదు అవగా.. కరోనా కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు కేరళకు చెందిన వారే. కాగా, తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో 2,311 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఈ కరోనా యాక్టివ్ కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 2041 కేసులు ఉన్నాయి.
Also Read:
ప్రతీ ‘పథకం’ సంచలనమే.. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎన్నికల వరాలు..