మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా.. మాస్క్‌ ధరించడం తప్పనిసరి.!

ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. కోట్లాది మంది ప్రాణాలు తీసుకున్న ఈ మహమ్మారి కొత్త వేరియంట్ల రూపంలో దూసుకోస్తుంది.అయితే తాజాగా ఈ వైరస్ సింగపూర్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది.ఇప్పటికే 26 వేల కొవిడ్ కేసులు నమోదైయాయి.

మళ్లీ వేగంగా విస్తరిస్తున్న కరోనా.. మాస్క్‌ ధరించడం తప్పనిసరి.!
New Update

వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న దేశంలో, కరోనావైరస్ ప్రభావం గణనీయంగా పెరిగింది. దీంతో అక్కడ మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ప్రపంచ దేశాలు కరోనా వల్ల జరిగిన నష్టాన్ని ఇప్పటికే మరచిపోలేదు. లాక్‌డౌన్‌ పేరుతో ప్రపంచ దేశాలు ఒకటిన్నర సంవత్సరం పాటు స్తంభించిపోయాయి.ఈ వైరస్‌ను ఎదుర్కోలేక అమెరికా వంటి అగ్రరాజ్యాల నుంచి పేద దేశాల వరకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పొవాల్సి వచ్చింది.

ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా వైరస్ ఆర్థిక ప్రభావం ఇంకా కోలుకోలేదని నివేదికలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో దేశ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.మే 5వ తేదీన నాటికీ 13,700 మందికి కరోనా వైరస్ సోకగా అది క్రమంగా పెరుగుతూ  26 వేలకు చేరుకుంది. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సింగపూర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలపై ఆరోగ్య శాఖ నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. మరిన్ని కేసులను పరిష్కరించడానికి ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.అయితే, వ్యక్తులు పూర్తిగా సహకరిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని ప్రభుత్వం సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేసింది, వృద్ధులు గత 12 నెలల్లో ఎటువంటి కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే, వారు ఇప్పుడు అదనపు టీకా తీసుకోవచ్చు. ప్రస్తుత వాతావరణంలో మాస్క్‌లు ధరించడం మినహా మరే ఇతర పరిమితులను ఉల్లంఘించబోమని ఆ దేశ ఆరోగ్య మంత్రి చెప్పారు.

#singapore #coronavirus #corona-mask
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe