AP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక

నెల్లూరు జిల్లా గూడూరులోని అరుంధతియ వాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి.

AP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక
New Update

Nellore:  ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం అరుంధతియ వాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.

Also Read: గిరిజనులకు తప్పని వరద కష్టాలు.. తాళ్ల సాయంతో వాగును దాటుతున్న ప్రజలు..!

గంజాయి అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, రెండు కేసులు కన్నా ఎక్కువ నమోదైతే వారిపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని వెల్లడించారు. అనుమానిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి ఉంచామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. కార్దన్ సెర్చ్ లో సిఐలు, ఎస్ఐలు 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

#latest-news-in-telugu #nellore #ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe