Coolie Movie: రజినీకాంత్ 'కూలీ' లో కోలీవుడ్ ముద్దుగుమ్మ.. ఫస్ట్ లుక్ రిలీజ్

సూపర్ స్టార్ రజినీకాంత్- దర్శకుడు లోకేష్ కనగ‌రాజ్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ’కూలీ’. తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో శృతి హాసన్ ప్రీతీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.

Coolie Movie: రజినీకాంత్ 'కూలీ' లో కోలీవుడ్ ముద్దుగుమ్మ.. ఫస్ట్ లుక్ రిలీజ్
New Update

Coolie Movie: కమల్ హాసన్ 'విక్రమ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ'. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో సూపర్ స్టార్ లుక్, యాటిట్యూడ్, డైలాగ్స్ ఫ్యాన్స్ కు పిచ్చెకించాయి. స్టార్ కాస్ట్ తో తెరకెక్కతున్న ఈ మూవీ నుంచి ఒక్కొక్క పాత్రను రివీల్ చేస్తూ ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. ఇటీవలే టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

శృతి హాసన్ ఫస్ట్ లుక్

అయితే తాజాగా మరో పాత్రను రివీల్ చేశారు. హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో శృతి హాసన్ ప్రీతీ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ 171వ సినిమాగా రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మంజుమల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్, మహేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Nara Lokesh: బాల‌ మామ‌య్యా..స‌రిలేరు నీకెవ్వ‌ర‌య్యా!.. నారా లోకేష్ పోస్ట్ - Rtvlive.com

#rajinikanth-coolie #shruti-haasan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe