Partner Angry: మీపై భాగస్వామి కోపంగా ఉంటే చిన్న చిట్కాలతో కూల్‌ చేయండి

ప్రతి బంధంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అది స్నేహితుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య కావచ్చు. కొన్నిసార్లు సంబంధంలో కొన్ని విషయాలు చిచ్చురేపుతాయి. అయితే కోపం తెచ్చుకోకుండా మీ భాగస్వామీని కూల్‌ చేయడం తెలియాలి. ఈ రిలేషన్‌షిప్‌ చిట్కాల కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Partner Angry: మీపై భాగస్వామి కోపంగా ఉంటే చిన్న చిట్కాలతో కూల్‌ చేయండి
New Update

Partner Angry: ప్రతి బంధంలో గొడవలు అనేవి సర్వసాధారణం. అది స్నేహితుల మధ్య లేదా భార్యాభర్తల మధ్య కావచ్చు. కొన్నిసార్లు సంబంధంలో కొన్ని విషయాలు చిచ్చురేపుతాయి. వీటిని సకాలంలో పరిష్కరించకపోతే సంబంధంలో దూరం పెరుగుతుంది. మీ భాగస్వామి మీపై కోపంగా ఉంటే ఆమెను సమయానికి కూల్‌ చేయడం చాలా ముఖ్యం. భాగస్వామి కోపంపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మాట్లాడటానికి ప్రయత్నించండి:

కోపాన్ని శాంతింపజేయడానికి మొదట మీరు అవతలవారి కోపానికి కారణాన్ని అర్థం చేసుకోవాలి. చాలా మంది అబ్బాయిలు క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతారు. ఇది తప్పని నిపుణులు అంటున్నారు. కోపానికి కారణం తెలియకుండా క్షమాపణలు చెప్పడం సరికాదంటున్నారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉండాలని, ఒకరికొకరు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని అంటున్నారు. కారణం తెలుసుకోవడానికి భాగస్వామితో ప్రేమగా మాట్లాడాలని, అయినా కోపంగా ఉంటే కొంత సమయం వేచిచూసి వారికి ఇష్టమైన పువ్వు లేదా చాక్లెట్‌ ఇచ్చి మళ్లీ అడగాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

publive-image

మాట్లాడటం ఆపవద్దు:

చాలా మంది కోపం వచ్చిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేస్తారు. మరుసటి రోజు ఉదయానికి అంతా సర్దుకుంటుందని భావిస్తుంటారు. కానీ దీని వల్ల దూరం మరింత పెరుగుతుంది. అవతలి వ్యక్తి కోపంగా ఉంటే సమస్య ఏంటో అడగాలని, ఒకరికొకరు చెప్పేవి ఓపికగా విని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎవరో ఒకరు తప్పును గ్రహించి క్షమాపణ చెప్పే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

భాష విషయంలో జాగ్రత్త:

ఒకరినొకరు నిజంగా ప్రేమిస్తుంటే సంబంధంలోకి అహాన్ని తీసుకురావొద్దని, తగాదా సమయంలో భాషపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. బూతులు మాట్లాడటం సరికాదని చెబుతున్నారు. కుటుంబ నేపథ్యం, ​​ఆర్థిక స్థితిగతుల అంశాలు అస్సలు ప్రస్తావించవద్దని నిపుణులు అంటున్నారు.

publive-image

క్షమించండి:

ఎంత పెద్ద సమస్య అయినా మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం ద్వారా పరిష్కారం అవుతుంది. నిజంగా మీ తప్పును అంగీకరించి మీ భాగస్వామిని ఒప్పించాలనుకుంటే మనస్పూర్తిగా క్షమాపణ చెప్పాలి. దీని కోసం పువ్వులు, చాక్లెట్లు ఇవ్వవచ్చు లేదా మీ భాగస్వామిని డేట్‌కి తీసుకెళ్లడం ద్వారా జీవితం సాఫీగా సాగిపోతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: మీకు పిజ్జా తినే అలవాటు ఉందా?.. ఎంత ప్రమాదమో తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#life-tips #small-tips #partner-angry
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe