ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు హైకోర్టు నోటీసులు

తెలంగాణలో అత్యంత లాభాల్లో ఆర్టీసీ నడుస్తోందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆర్టీసీ ఉద్యోగులు చాలాసార్లు ధర్నాలు చేసినా వాళ్లకి ఎలాంటి న్యాయం జరగలేదు. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌పై హైకోర్టు సీరియస్ అయింది. ఉద్యోగుల క్రెడిట్ సొసైటీ బకాయిల చెల్లింపుపై వివరణ కావాలంటూ చీఫ్‌ మేనేజర్‌లకు నోటీసులు ఇచ్చింది.

New Update
ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు హైకోర్టు నోటీసులు

Contempt of court notices to TS RTC MD Sajjanar

తమ ఆదేశాలను పాటించకపోవడంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, చీఫ్‌ మేనేజర్‌లకు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్‌ సొసైటీకి బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. కానీ, తమ ఆదేశాలు అమలుకాకపోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ సజ్జనార్, ఆర్టీసీ చీఫ్ మేనేజర్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. నేరుగా హాజరు కావడం ద్వారాగానీ, న్యాయవాది ద్వారాగానీ వివరణ ఇవ్వాలని సూచించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు