Srisailam : శ్రీశైలవాసులకు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ. 19కోట్ల అంచనా వ్యయంతో 30 పడకలు ఆసుపత్రి(Hospital) ని నిర్మించాలని శ్రీశైలం దేవస్థానం(Srisailam Temple) ధర్మకర్తల సమావేశం తీర్మానించింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి(Chakrapani Reddy) అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. దేవస్థానం గో సంరక్షణ శాలలో రూ. 36లక్షల అంచనా వ్యయతో రక్షణ కంచె ఏర్పాటు, అవసరం ఉన్న చోట్ల గాల్వనైజ్డ్ షీట్ తో షేట్ ఏర్పాటు, సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టాలని తీర్మానించారు.
దేవస్థానం ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలివే:
-కర్నూల్(Kurnool) నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం దగ్గర రూ 4.99కోట్లతో కల్యాణ మండపం నిర్మాణం.
-3.7కోట్ల అంచనా వ్యయంతో వాణిజ్య సముదాయం ఏర్పాటు.
-రూ. 15కోట్ల అంచనా వ్యయంతో సున్నిపెంటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాలకు నీటి సరఫరా ఏర్పాట్లు.
-రూ. 9.5 లక్షల అంచనా వ్యయంతో మల్లికార్జున్ సదన్(Mallikarjun Sadhan) అతిథి గ్రుహానికి మరమ్మతు పనులు.
-భక్తుల సౌకర్యం కోసం రూ. 10.60 లక్షలతో కుమార సదన్ వసతి సముదాయంలో డెవలప్ పనులు.
-రూ.39.90 లక్షలతో వచ్చే వేసవి, శ్రావణ మాసం, గణపతి నవరాత్రులు, దసరా మహోత్సవాలు, కార్తీక మాసం తదితర సందర్భాల్లో పైప్ పెండాల్స్, షామియానాలు, గ్రీన్ మ్యాట్ తదితరాల ఏర్పాటు.
-రూ.15.5 లక్షలతో భద్రతా చర్యల్లో భాగంగా పాత పుష్కరిణి వద్ద రక్షణ కటంజనాలు, పుష్కరిణి పరిసర ప్రాంతంలో సుందరీకరణ పనులు.
రూ.16.75 లక్షలతో భద్రతాచర్యల్లో భాగంగా హాటకేశ్వరాలయం వద్ద రక్షణ కటంజనాల ఏర్పాటు.
రూ.17 లక్షలతో ఫిల్టర్ బెడ్ దగ్గర భక్తుల సౌకర్యం కోసం పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు.
రూ.15 లక్షలతో పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా క్షేత్ర పరిధిలో పలుచోట్ల చెత్త కుండీల ఏర్పాటు.
ఇది కూడా చదవండి : ఐకూ అదిరే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. నియో 9 ప్రో ధర, ఫీచర్లు చూస్తే కొనాల్సిందే.!