Constitution day of India: ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రాజ్యాంగం మనది.. ఎందుకంటే.. 

భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్దది. ఏ దేశ రాజ్యాంగానికి లేని ప్రత్యేకత మన రాజ్యాంగానికి ఉంది. 2015లో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్26ను రాజ్యాంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 26, 1949న రాజ్యాంగం ఆమోదం జరిగింది. 

New Update
Constitution day of India: ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రాజ్యాంగం మనది.. ఎందుకంటే.. 

Constitution day of India: భారతదేశం.. ప్రపంచ దేశాల్లో దేనికీ లేని ప్రత్యేకత ఉన్న దేశం. ఆ ప్రత్యేకతే మన రాజ్యాంగం. శతాబ్దాల పాటు పరాయి పాలనలో నలిగిపోయిన భారతీయులకు ఎందరో మహానుబావులు తమ త్యాగఫలంతో స్వతంత్రాన్ని తీసుకువచ్చారు. ప్రజలే పాలకులుగా రూపుదిద్దుకున్న రాజ్యం అఖండ భారతదేశం. పాలనకు ఒక దశ.. దిశ కల్పించడం కోసం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసుకున్నాం. స్వతంత్ర దేశంగా భారత్ ఆవిర్భవించిన తరువాత మన రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949న ప్రస్తుతం మనం అనుసరిస్తున్న రాజ్యాంగాన్ని ఆమోదించింది. దీనిని జనవరి 26, 1950 నుంచి అమలులోకి తీసుకువచ్చారు. అందుకే మనం జనవరి 26ను రిపబ్లిక్ డే గా ఘనంగా జరుపు కుంటాం. 

ఇదిలా ఉంటే.. మన రాజ్యాంగం(Constitution Day of India) ఏమీ ఆషామాషీగా తయారు కాలేదు. స్వతంత్ర పోరాటం కోసం ఎంత శ్రమ తీసుకున్నారో.. అంతే శ్రద్ధ రాజ్యాంగ తయారీలోనూ తీసుకున్నారు. మన రాజ్యాంగ మొదటి ముసాయిదాను బెనెగల్ నర్సింగ్ రావు రూపొందించారు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎం.గోపాలస్వామి, బీఆర్ అంబెడ్కర్, కెఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బిల్ మిట్టర్, డిపి ఖైతాన్ లతో కూడిన ఏడుగురు సభ్యుల డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగాన్ని  ఖరారు చేసే వరకు ఎన్నో సవరణలు చేసింది. భరత రాజ్యాంగం మూడు శాఖలతో ఉంటుంది. అవి శాసన సభ, కార్య నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. అలాగే, ఆరు ప్రాథమిక హక్కులను దేశ పౌరులందరికీ కల్పించింది రాజ్యాంగం. అవి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, దోపిడీ వ్యతిరేక హక్కు, మత స్వేచ్ఛ హక్కు, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు, రాజ్యాంగ పరిష్కారాల హక్కు. ప్రజలందరికీ సమానంగా ఈ హక్కులను కల్పించింది మన రాజ్యాంగం. 2015లో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబర్26ను రాజ్యాంగ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలకు రాజ్యాంగ  విలువలను తమ జీవితాల్లో పాటించేలా చేయాలనేదే ఈరోజు ఉద్దేశ్యంగా ఉండాలని లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈరోజు నవంబర్ 26.. భారత రాజ్యాంగ దినోత్సవం. ఈ సందర్భంగా మన రాజ్యాంగానికి సంబంధించిన ప్రత్యేకతలు తెలుసుకుందాం. 

Also Read: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారి డీఏ పెంపు.. 

  • డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను 'భారత రాజ్యాంగ పితామహుడు' అని పిలుస్తారు. ఆయన  ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించారు.  రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. 
  • ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చేతితో రాయడం విశేషం . 
  • నంద్ లాల్ బోస్, ఆధునిక భారతీయ కళకు మార్గదర్శకుడు, రాజ్యాంగంలోని ప్రతి పేజీ బౌండరీస్ రూపొందించి. అవసరమైన చిత్రాలతో అలంకరించారు. 
  • కాలిగ్రాఫిక్ కళలో మాస్టర్ అయిన ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా ఒంటరిగా రాజ్యాంగాన్ని రచించారు. .
  • రాజ్యాంగం అసలు మాన్యుస్క్రిప్ట్ 16X22 అంగుళాల పార్చ్‌మెంట్ షీట్‌లపై వెయ్యి సంవత్సరాల జీవితకాలంతో రాశారు. దీని బరువు 3.75 కిలోలు.
  • భారత రాజ్యాంగం పేరు US నుంచి తీసుకున్నారు.  దీని విధులు బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. 
  • 1949లో 284 మంది సభ్యులు సంతకం చేయడంతో రాజ్యాంగం ఆమోదం జరిగింది.  ఇది రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసింది.
  • భారత రాజ్యాంగం హిందీ - ఇంగ్లీష్ రెండు భాషల్లో రాశారు. 
  • భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి దాదాపు 2 సంవత్సరాల, 11 నెలల - 18 రోజులు పట్టింది.
  • భారత రాజ్యాంగం సార్వభౌమ దేశానికి ప్రపంచంలోనే అతి పెద్దదైనదిగా రికార్డు సృష్టించింది. 
  • భారత రాజ్యాంగం పీఠిక, 448 ఆర్టికల్స్‌తో 22 భాగాలు, 12 షెడ్యూల్‌లు, 5 అనుబంధాలు - 115 సవరణలను కలిగి ఉంది.

Watch This Interesting Video:

Advertisment
తాజా కథనాలు