Constitution copy coin for MPs on special session: రేపు(సెప్టెంబర్ 19) కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం రోజున ఎంపీలకు భారత రాజ్యాంగ ప్రతిని, పార్లమెంటుకు సంబంధించిన పుస్తకాలు, స్మారక నాణెం, స్టాంపును అందుకుంటారు. ఎంపీల కోసం ఒక గిఫ్ట్‌బ్యాగ్‌లో ఈ బహుమతులు ఉంటాయి. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల 2వ రోజు కొత్త భవనంలో జరగనుంది. రాజ్యసభ మధ్యాహ్నం 2:15 గంటలకు కొత్త పార్లమెంట్ భవనంలోని ఎగువ సభ ఛాంబర్‌లో, లోక్‌సభ మధ్యాహ్నం 1:15 గంటలకు కొత్తగా నిర్మించిన కాంప్లెక్స్‌లోని దిగువ సభ ఛాంబర్‌లో సమావేశమవుతుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపైనే చర్చ:
మరోవైపు ప్రత్యేక సమావేశాల మొదటి రోజు ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ భేటీ ఇప్పటికే ముగియగా.. మీటింగ్‌లో ఏం చర్చించారన్నదానిపై కేంద్రం గోప్యత పాటిస్తోంది. మహిళ రిజర్వేషన్ బిల్లుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలని కేంద్రం ఎన్డీఏ నిర్ణయించుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతకుముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
షెడ్యూల్ ఇదే:
➼ సెంట్రల్ హాల్ కార్యక్రమం రేపు(సెప్టెంబర్ 19) మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది
➼ ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక ఉభయ సభ.. ఈ సెంట్రల్ హాల్ పాత పార్లమెంటులో ఉంది
➼ రేపు, ప్రధాని మోదీ రాజ్యాంగం కాపీతో పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ వరకు కాలినడకన వెళ్లనున్నారు.
➼ లోక్‌సభ మధ్యాహ్నం 1:15గంటలకు
➼ రాజ్యసభ మధ్యాహ్నం 2:15 గంటలకు స్టార్ట్.
మోదీ నేతృత్వంలోనే..:
లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంతో ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి . పార్లమెంటు పాత ప్రాంగణంలో జరిగిన ముఖ్యమైన చారిత్రక సంఘటనల గురించి మోదీ మాట్లాడుతూ.. రేపు కొత్త పార్లమెంటు భవనానికి సభా కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ, పాత భవనం తరతరాలకు స్ఫూర్తినిస్తుందన్నారు మోదీ. తన ప్రసంగంలో, సభా కార్యక్రమాలలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం, సహకారాన్ని మోదీ ప్రస్తావించారు. దాదాపు 600 మంది మహిళా ఎంపీలు ఉభయ సభల గౌరవాన్ని పెంచారన్నారు. దేశ గొప్ప పార్లమెంటరీ వారసత్వాన్ని స్మరించుకునేలా మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్, పీఎం మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఒక కార్యక్రమంలో పాల్గొంటారని పీటీఐ(PTI) నివేదించింది.
ALSO READ: భగత్‌సింగ్, నెహ్రు నుంచి మోదీ వరకు.. పాత పార్లమెంట్ భవనం చరిత్ర ఇదే..!