NTR District: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభుత్వ లాంఛనాలతో గంధం నరేంద్ర భౌతిక కాయానికి పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
This browser does not support the video element.
కానిస్టేబుల్ గంధం నరేంద్ర స్వగ్రామం ఎ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు నరేంద్ర. కష్టపడి చదివి పోలీసు శాఖలో పనిచేయాలనే లక్ష్యంతో కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యారు. నరేంద్రకు భార్య, మూడేళ్ల కుమారుడు, ఏడు నెలల కుమార్తె ఉన్నారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నాడు నరేంద్ర. వినాయక పండుగా సందర్భంగా కానిస్టేబుల్ నరేంద్రకు ఆగిరిపల్లిలో డ్యూటీ వేసారు పోలీస్ అధికారులు. అయితే, వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడిలో కానిస్టేబుల్ గంధం నరేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నరేంద్రను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా,నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు.
This browser does not support the video element.
ఎంతో వినయంగా ఉండే కానిస్టేబుల్ చనిపోవడంతో పోలీస్ శాఖలో విషాదాలు అలుముకున్నాయి. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం నరేంద్ర భౌతిక కాయాన్ని స్వగ్రామం పోలిశెట్టిపాడు తీసుకు వచ్చారు. పోలిశెట్టిపాడు గ్రామంలో అంత్యక్రియలకు తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎన్టీఆర్ జిల్లా డీసీపీ అజిత వేజెండ్ల IPS, ఏలూరు ఏఎస్పి శేఖర్ , ఎనిమిది మండలాల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొని గంధం నరేంద్ర భౌతిక గాయానికి ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు. జోహార్ నరేంద్ర అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా తుది వీడ్కోలు పలికారు. కానిస్టేబుల్ నరేంద్ర కుటుంబంకు అండగా ఉంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
Also Read : నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్..ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు!