కానిస్టేబుల్ కిరాతకం..తండ్రిని ఇంటికి పిలిపించుకుని ఏం చేశాడంటే..?
ఆస్తికోసం కన్న కొడుకే చిత్రహింసలు పెడుతున్నాడని భీమవరానికి చెందిన రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు ఆర్టీవీతో ఆవేదన వ్యక్తం చేశారు. కని పెంచిన కొడుకు నుంచే తనకు రక్షణ కావాలని రిటైర్డ్ ఏఎస్ఐ కొండలరావు కేసు పెట్టారు. ద్వారకా తిరుమలలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన పెద్ద కొడుకు మధు.. తనను ఇంటికి పిలిచి మరీ ఇనుపరాడ్ తో దాడి చేశాడని కన్నీటి పర్యంతం చెందుతున్నాడు. దీంతో కానిస్టేబుల్ మధు తీరుపై సర్వత్ర విమర్శలు గుప్పిస్తున్నారు. బాధ్యతమైన పదవిలో ఉంటూ రిటైర్ట్ అయిన కన్న తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఆస్తి కోసం ఇంత దారుణంగా ప్రవర్తిసారా అంటూ మండిపడుతున్నారు.