ప్రగతి భవన్ నుంచే నాపై హత్యకు కుట్ర: ఈటల రాజేందర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ నుంచే తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయం తనకు బీఆర్ఎస్ నేతల నుంచే తెలిసిందని చెప్పారు. సుపారీ ఇచ్చి తనను చంపించేందుకు యత్నిస్తున్నారని ఈటల అన్నారు. By Vijaya Nimma 28 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి 20 కోట్లు ఇచ్చి హత్యకు ప్లాన్ కొంతమంది సైకోలు శాడిస్టులు చిల్లరగాళ్లు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది రాష్ట్ర సీఎంకి ప్రభుత్వానికి మంచిది కాదని అభిప్రాయపడ్డాను బీజేపీ సీనియర్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల కాలంలో అధికారులను ప్రతిపక్ష నేతలను ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అక్రమ నిర్బంధాలు అక్రమ కేసులు అధికమవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలని పరోక్షంగా కౌశిక్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి వారిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 20 కోట్లు ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారన్న సమాచారం వచ్చిందని అయితే కమలాపూర్ హుజరాబాద్ మధ్యలో ఏం జరుగుతుందో పోలీసులు తెలుసుకోవాలని. గతంలో పంగిడి పెళ్లి అనే గ్రామం వద్ద ప్లాన్ ప్రకారం తనపై దాడి జరిగిందన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ప్రజలు తిరగబడే రోజుకు వస్తుందని వచ్చిందని ప్రభుత్వ తీరు తన్నులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని కొంతమంది స్థానిక నాయకుల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సైకోని సస్పెండ్ చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఒక సైకో అని, శాడిస్ట్ అని, తనతో పాటు బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక సైకోను కేసీఆర్ ఎమ్మెల్సీగా నియమించారని దుయ్యబట్టారు. తన భద్రతను నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని అన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి