Rythu Bandhu : రైతుబంధుపై కొత్త రూల్స్ ఇవే.. అలాంటి భూములకే సాయం? రైతు బంధు సాయం అందించడానికి కొత్త రూల్స్ రూపొందించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేవలం సాగులో ఉన్న భూములకే రైతుబంధు సాయం ఇవ్వాలని, రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. By Nikhil 23 Dec 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Revanth Reddy : రైతుబంధులో(Rythu Bandhu) కీలక మార్పులు చేసేందుకు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 2 అంశాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా సాగుచేసే భూమికే రైతుబంధు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరొకటి.. కేవలం రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే సాగు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. సాగుచేసే భూములపై మాత్రం ఎలాంటి పరిమితి ఉండొద్దన్నది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. అలా చేస్తే ఇన్నాళ్లూ సాయం పొందిన ఆయా వర్గాల రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: TS Congress: మల్కాజ్‌గిరిలో మైనంపల్లికి బిగ్ షాక్.. తుమ్మల ప్లాన్ ఇదేనా? ఎన్ని ఎకరాలు సాగుచేసినా రైతుబంధు ఇచ్చే యోచనలో రేవంత్ సర్కార్ ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం సాగుచేయని భూములకూ రైతుబంధు సాయం అందుతోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాళ్లు, రప్పలు, గుట్టలకు కేసీఆర్ సర్కార్ రైతు బంధు సాయం ఇస్తుందని ఆ సమయంలో కాంగ్రెస్ తో పాటు వివిధ పార్టీల నేతలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కేవలం సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు బంధు సాయం ఇవ్వాలన్నది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. గతంలో భూమి ఉంటేచాలు ఓనర్ ఎక్కడున్నా.. రైతు బంధు సాయం డబ్బులను ప్రభుత్వం అందించేది. ఇప్పుడు ఆ నిబంధనను కూడా మార్చనుంది. అయితే.. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి, ట్యాక్స్ కట్టే వారికి రైతు బంధు తొలగించాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ సాగుతోంది. అతి త్వరలోనే ఈ అంశంపై నిబంధనలను విడుదల చేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. #cm-revanth-reddy #congress-party #rythu-bandhu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి