ఆ ఎంపీ సీట్ ఎవరికో!.. మల్కాజిగిరి కాంగ్రెస్‎లో ఏం జరుగుతోంది?

మల్కాజిగిరి కాంగ్రెస్‎లో పరిణామాలు పార్టీ కేడర్ లో అయోమయం నింపుతున్నాయి. లోకసభ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశానికి మైనంపల్లి హనుమంతరావు హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.

New Update
ఆ ఎంపీ సీట్ ఎవరికో!.. మల్కాజిగిరి కాంగ్రెస్‎లో ఏం జరుగుతోంది?

Malkajgiri: మల్కాజిగిరి కాంగ్రెస్‎లో గేమ్ మొదలైంది. అక్కడ జరుగుతున్న పరిణామాలు పార్టీ కేడర్ లో అయోమయం నింపుతున్నాయి. ఎంపీ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, కీలక నేతలతో శనివారం నాడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశం అనంతర పరిణామాలు కార్యకర్తలు, నాయకుల్లో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఈ సమావేశానికి మైనంపల్లి హాజరు కాకపోవడం పార్టీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇది కూడా చదవండి: Telangana: కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: మంత్రి రాజనర్సింహ

మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన మధుయాష్కీ గౌడ్ హాజరు కాగా, మల్కాజిగిరి నుంచి పోటీచేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు హాజరు కాలేదు. ఆయన గైర్హాజరుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమావేశంపై ఆయనకు సమాచారం ఉందా లేదా అన్న అనుమానాలు కూడా కార్యకర్తల్లో తలెత్తుతున్నాయి. అయితే మైనంపల్లి దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లారని, అందుకే సమావేశానికి రాలేకపోయారని చెప్తున్నారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: టీడీపీలో 14 సిట్టింగ్స్ కన్ఫామ్.. వీరికి మాత్రం డౌటే..!

ఎంపీ స్థానానికి పోటీ
కాగా, మల్కాజిగిరి ఎంపీ స్థానం కోసం పార్టీలో ఇప్పుడు అనేకమంది పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం మినహా అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఈ ఎంపీ సీటుకు డిమాండ్ పెరిగింది. మధుయాష్కీ గౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మల్కాజ్గిరి ఎంపీ స్థానంపైనే ముందుగా దృష్టిసారించడం కూడా ఇప్పుడు చర్చలకు కారణమైంది.

ఎమ్మెల్సీగా ఎవరవుతారో!
ఎంపీ సీటుతో పాటు గవర్నర్ కోటాలో వచ్చే రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం కూడా పార్టీలో విపరీతమైన పోటీ ఉంది. అయితే, మైనంపల్లి ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గతంలో బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ అధ్యక్షుడిగా మైనంపల్లి పనిచేశారు. దీంతో నగరం, ఇక్కడి రాజకీయాలపై ఆయనకు పట్టుంది. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీగా పోటీ చేస్తారా, లేదంటే ఎమ్మెల్సీ అవుతారా అన్నది తేలాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు