Home Minister Amit Shah: ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలో బహిరంగ ర్యాలీని ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు దాడికి దిగారు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం ఒక కుటుంబానికి చెందినది కాదు, ఇది రాయ్‌బరేలీ, అమేథీ ప్రజలకు చెందినదని అన్నారు అమిత్ షా. రాయ్‌బరేలీ, అమేథీ ఆ రెండు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ కాపాడిందని విమర్శించారు.
ALSO READ: రిజర్వేషన్లను రద్దు చేయము.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్, ఫరూక్ అబ్దుల్లాలు పీఓకే గురించి మాట్లాడవద్దని, పాకిస్థాన్ వద్ద అణుబాంబు ఉందని అంటున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ, మీరు పాకిస్థాన్ కు భయపడవచ్చు కానీ పీఓకే భారతదేశానికి చెందినది.. మేము (బీజేపీ) దానిని వెనక్కి తీసుకుంటాము." అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని అన్నారు అమిత్ షా. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతికి పాల్పడిన వారిని బీజేపీ జైల్లో పెడుతామని హెచ్చరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరిగిందని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రం నుంచి గూండాలను తరిమేసే పని చేశారని పేర్కొన్నారు. రాయ్‌బరేలీ మరియు అమేథీలు ఎప్పుడూ గాంధీ కుటుంబాన్ని తమ నాయకులుగా భావించారని.. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రం వీరిని ఎప్పుడు తమ ప్రజలుగా గుర్తించలేదని విమర్శించారు.