TGPSC Group-2 Exam: గ్రూప్-2 వాయిదా.. కాంగ్రెస్ ఎంపీ కీలక ప్రకటన TG: బేగంపేట టూరిజం ప్లాజాలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిరుద్యోగులతో సమావేశం అయ్యారు. గ్రూప్ -2 వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ప్రకటించారు. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. ప్రభుత్వం త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. By V.J Reddy 18 Jul 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Group-2 Exam: బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో భేటీ కాంగ్రెస్ నేతలు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సమావేశం అయ్యారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందొద్దు అని సూచించారు. నిరుద్యోగుల సమస్యల పట్ల సీఎం సానుకూలంగా ఉన్నారని వివరించారు. ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారని చెప్పారు. పదేండ్లలో కేసీఆర్ ఎన్ని భర్తీ చేశారో అందరికి తెలుసు అని అన్నారు. మూడు నెలల కాలంలో 30 వేల ఉద్యోగాల భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేయనుందని చెప్పారు. DSC అభ్యర్థులు పరీక్షలను చక్కగా రాసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రూప్ -2 పరీక్షపై సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరీక్షలను వాయిదా వేయడానికి సర్కార్ ఆలోచన చేస్తోందని చెప్పారు. నిరుద్యోగులతో చర్చించిన అన్ని విషయాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిరుద్యోగుల సమస్యలను సీఎంకు వివరిస్తామన్నారు. దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. Your browser does not support the video tag. #group-2-exam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి