Telangana Politics: ఆ గ్యారెంటీలు.. గట్టెక్కిస్తాయా? బీఆర్ఎస్‌ని ఓడించేందుకు పంచతంత్రం..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్‌ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి కారణాలైన ఐదు గ్యారెంటీలే స్ట్రాటజీని ఇక్కడ కూడా అమలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ ఇస్తామని ప్రకటించగా అవి కాకుండా అమలు చేయగలిగే పథకాలు, హామీలనే మేనిఫెస్టోలో పెట్టాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

New Update
TS Congress: తెలంగాణ కాంగ్రెస్ మరో సంచలన హామీ.. వారికి గౌరవ వేతనం?

Congress strategy to win Telangana assembly polls: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యుహా రచనలో నిమగ్నమయ్యాయి. అధికార బీఆర్ఎస్(BRS) సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. ప్రతిపక్షాలు ప్రజల్ని ఆకట్టుకునేలా మేనిఫెస్టో(Manifesto) రూపొందించే పనిలో బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు డిక్లరేషన్, నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించింది. తాజాగా మేనిఫెస్టో రూపకల్పనలో నిమగ్నమైంది. అయితే, అంతకు ముందు కర్ణాటక ఎన్నికల ముందు మాదిరిగా తెలంగాణలో కూడా ఐదు గ్యారెంటీలను ఇవ్వడానికి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన మాదిరిగానే.. ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు.

ఐతే, ఆ ఐదు గ్యారెంటీలు ఏమిటన్న అంశంపై పార్టీ నేతలు గుంభనంగా ఉంటున్నారు. ఈ నెల 17న తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహిస్తున్నారు. ఆ బహిరంగ సభలో సోనియాగాంధీ చేత తెలంగాణలో అమలుచేసే 5 ప్రధాన హామీల గ్యారంటీ పత్రాన్ని విడుదల చేయించాలని కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఐదు గ్యారెంటీలపై ఫొకస్‌:
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి ఆ పార్టీ ముందస్తుగా ప్రకటించిన ఐదు గ్యారెంటీలే కారణం... ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చే.. ఆ ఐదు గ్యారంటీలు ఇవే...

➊ మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌
➋ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
➌ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ
➍ యువతకు ఉద్యోగాల భర్తీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీం పునరుద్ధరణ
➎ బీసీ, మైనార్టీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా:
అధికారంలోకి రాగానే మొదటి ప్రైయార్టీగా ఈ ఐదు గ్యారెంటీలనే అమలు చేస్తామని కాంగ్రెస్ హమీ ఇస్తోంది. అలాగే, అమలు చేయగలిగే పథకాలు, హామీలనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించింది. ఒక్కో వర్గానికి సంబంధించి ఒక్కో ప్రధానాంశాన్ని పార్టీ ఇచ్చే గ్యారంటీల్లో చేర్చాలని కూడా డిసైడ్ అయింది. ప్రజల జీవితాల్లో మార్పు వచ్చేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు మొదలైన మైనారిటీలందరి భద్రత, అభివృద్ధి విజన్‌ డాక్యుమెంట్‌ ను కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌ ను తయారు చేస్తున్నారు. ఈ డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై కమిటీకి 400 వరకు సూచనలు అందాయట. వాటి క్రోడీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. వాటిని మైనారిటీల ఆర్థిక, మహిళా సాధికారత, సాంస్కృతిక, మతపరమైన సంస్థలు.... తదితర అంశాలుగా వర్గీకరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

ALSO READ: ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు స్తంభాలాట.. ఇలా అయితే ఎలా..?

Advertisment
తాజా కథనాలు