/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Rahul-and-Priyanka-gandhi-2-jpg.webp)
Wayanad :ఈరోజు వయనాడ్‌కు వెళ్లనున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వయనాడ్ ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వస్తానికి రాహుల్ గాంధీ నిన్ననే వయనాడ్ లో పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణ పరిస్థితి వల్ల పర్యటన వాయిదా వేసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 254కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
ఇదిలా ఉంటే కేంద్రం వైఫల్యం వల్లే ఈ ప్రమాదానికి అనేక మంది సామాన్య జనాలు బలైయ్యారు అని పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. "ఈ సంఘటనపై ఈ రోజు ఆయన రాజ్యసభలో మాట్లాడారు. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ఈ నెల 23న హెచ్చరించినట్లు చెప్పారు. అయినా ఆ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
సరైన సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని ఆరోపించారు. వయనాడ్ ఘటనపై రాజకీయం తగదని అన్నారు. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడూ రివ్యూ చేస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్‌ను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. NDRF బృందాలు 24 గంటలుగా కష్టపడుతున్నాయని అన్నారు.
Also Read : ఢిల్లీలో కుండపోత.. ఏడుగురి మృతి!