AP: తిరుమలలో కాంగ్రెస్ ఆందోళన.. ఆ వివరాలను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచాలని డిమాండ్..!

తిరుమలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. శ్రీవారి దర్శనార్థం వీఐపీలకు కేటాయించే బ్రేక్ దర్శనాల వివరాలను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతి ఆక్రమలపై కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

New Update
AP: తిరుమలలో కాంగ్రెస్ ఆందోళన.. ఆ వివరాలను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచాలని డిమాండ్..!

Tirupati: తిరుమలలో టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వీఐపీలకు కేటాయించే బ్రేక్ దర్శనాల వివరాలను, ఎవరెవరికి ఎన్ని కేటాయించాలన్న పూర్తి వివరాలను టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంచాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆక్రమలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. జూ పార్క్ ప్రాంతంలో టీటీడీ ఉద్యోగులకు కోటర్స్ కట్టించాలని డిమాండ్ చేశారు.

Also Read: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే..

Advertisment
తాజా కథనాలు