Eluru: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ యస్ జగన్నాధపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఇనుపరాడ్డుతో చంపిన ఘటన వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ద్వారకా తిరుమల మండలం ఐయస్ జగన్నాధపురం గ్రామానికి చెందిన లాజర్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు. 20 సంవత్సరాల క్రితం తన పెద్ద కుమార్తెను జి కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారావుకి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే, గత సంవత్సర కాలంగా సుబ్బారావు అతని భార్య గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారు.
పూర్తిగా చదవండి..Crime News: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే..
ఏలూరు జిల్లా జగన్నాధపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన మామ లాజర్ను అల్లుడు సుబ్బారావు ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేయగా లాజర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పరారీలోని నిందితుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
Translate this News: