Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం... బీఆర్ఎస్ లోకి విజయశాంతి?

TG: బీఆర్ఎస్ ఇక ఉండదు అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు విజయశాంతి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అని బీఆర్ఎస్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో ఆమె త్వరలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరుతారనే చర్చ రాజకీయాల్లో మొదలైంది.

New Update
Vijayashanti : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం... బీఆర్ఎస్ లోకి విజయశాంతి?

Vijayashanti Supports BRS Party : తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) పార్టీని విమర్శిస్తూ టీబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కనిపించకుండా పోతుందని.. ఇక బీఆర్ఎస్ పని అయిపొయింది అని కిషన్ రెడ్డి(Kishan Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరుతారా అనే చర్చ మొదలైంది. ఇటీవల ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆమె పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో విజయశాంతి బీఆర్ఎస్ లో త్వరలో చేరబితున్నారు అనే చర్చకు బలం చేకూరినట్లైంది.

ALSO READ: గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో పెరగనున్న భూమి ధరలు

విజయశాంతి(Vijayashanti) ట్విట్టర్ (X)లో.. " తెలంగాణ ల బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం... ఎప్పటికీ.. ఇది అర్ధం చేసుకోకుండా వ్యవహరించే వారికి... దక్షిణాది ......దశాబ్ధాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గార్ల నుండి ఇప్పటి బీఆర్ఎస్, వైసిపి దంక ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించు కోవాల్సిన తప్పని అవసరం... ఎన్నడైనా.. వాస్తవం... ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం.. హర హర మహాదేవ్.. జై తెలంగాణ" అంటూ రాసుకొచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు