Vijayawada: 'పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రజలను రెచ్చగొట్టొద్దు'..ఆర్జీవీకి కాంగ్రెస్ పార్టీ నేత వార్నింగ్.!

వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ నేత మీసాల రాజేశ్వరరావు RTVతో మాట్లాడారు. సినిమాలో జగన్ ను హీరోని చేయడం కోసం సోనియాగాంధీని విలన్ గా చూపిస్తున్నాడని మండిపడ్డారు. పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రజలను రెచ్చగొట్టొద్దంటూ డైరెక్టర్ ఆర్జీవీకి వార్నింగ్ ఇచ్చారు.

New Update
Vijayawada: 'పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రజలను రెచ్చగొట్టొద్దు'..ఆర్జీవీకి కాంగ్రెస్ పార్టీ నేత వార్నింగ్.!

Congress Leader Rajeswara Rao: వ్యూహం సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు కాంగ్రెస్ పార్టీ నేత మీసాల రాజేశ్వరరావు. RTVతో ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ ను హీరోని చేయడం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీని విలన్ గా చూపిస్తున్నాడని మండిపడ్డారు. సోనియాగాంధీ పాత్రను తొలగించకపోతే మా సత్తా ఏంటో చూపిస్తాం అంటూ హెచ్చరించారు.

జగన్ జైలుకు వెళ్లడానికి సోనియాగాంధీకి సంబంధం ఏమటని ప్రశ్నించారు. అప్పటి టిడిపి నేత ఎర్ర నాయుడు, శంకర్రావు కేసు వేస్తే సిబిఐ ఎంక్వయిరీ జరిగిందని తెలిపారు. జగన్ జైలుకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీకి సోనియాగాంధీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం జగన్ లబ్ధి పొంది ఇప్పుడు రాజకీయ కక్షకు దిగుతున్నారని విమర్శలు గుప్పించారు.

Also read: విశాఖలో వైసీపీకి మరో షాక్..బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీనామా ?

జనంలో విలన్ గా ఉన్న జగన్ ను..వ్యూహం సినిమాలో హీరోగా చూపిస్తున్నారని కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ను గెలిపించాలనే వ్యూహంతోనే ఆర్జీవీ వ్యూహం సినిమా తీశాడని అన్నారు. ఆర్జీవీని ప్యాకేజీ డైరెక్టర్ అంటూ కౌంటర్ వేశారు. ఎవరో చెప్పిన మాటలను నమ్మి వాస్తవాలకు విరుద్ధంగా సినిమా తీశాడని వ్యాఖ్యనించారు. అయితే, ఈసారి జగన్ ఎట్టి పరిస్థితిలోనూ గెలవడని పేర్కొన్నారు.

పిచ్చి పిచ్చి సినిమాలు తీసి ప్రజలను రెచ్చగొట్టొద్దని.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమాను విడుదల చేయకుండా స్టే విధించిందని ఏపీ హైకోర్టు కూడా అదే తీర్పు ఇస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన పార్టీ నేత సోనియాగాంధీని కించపరిచే విధంగా చూపించడం, టీడీపీ అధినేత  చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అవమానిస్తూ సినిమాలు తీయడం సమంజసం కాదని..కేవలం రాజకీయ లబ్ధి కోసమే డైరెక్టర్ ఈ సినిమా తీశాడని మండిపడ్డారు. కోర్టు దృష్టిని మల్లించడానికి ఆర్జీవీ చాలా తెలివిగా మాట్లాడుతున్నారని అన్నారు. సోనియాగాంధీ ప్రతిష్టను దిగాజారేలే చేస్తే సహించేదే లేదని తేల్చిచెప్పారు.

Advertisment
తాజా కథనాలు