TS Congress: మల్కాజ్‌గిరిలో మైనంపల్లికి బిగ్ షాక్.. తుమ్మల ప్లాన్ ఇదేనా?

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి మాజీ ఎమ్మెల్సే మైనంపల్లి హన్మంతరావు హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీపై ఆయన ఏమైనా అలిగారా అన్న చర్చ సాగుతోంది.

New Update
TS Congress: మల్కాజ్‌గిరిలో మైనంపల్లికి బిగ్ షాక్.. తుమ్మల ప్లాన్ ఇదేనా?

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులుగా మంత్రులను నియమించింది. ఇందులో భాగంగా మల్కాజ్‌గిరికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageshwar Rao) ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో రంగంలోకి దిగిన తుమ్మల.. గెలుపే లక్ష్యంగా తనదైన శైలిలో గేమ్‌ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ నేతలతో ఆయన నిన్న భేటీ నిర్వహించారు. అయితే.. మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన మైనంపల్లి హన్మంతరావు (Myanampally Hanmantha Rao) లేకుండానే ఈ భేటీ సాగడం.. కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది.
ఇది కూడా చదవండి: Dasoju Shravan : సీఎం రేవంత్ రెడ్డికి దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ

అయితే.. ఈ భేటీకి ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తో పాటు కార్పొరేటర్లు, కీలక నేతలు హాజరయ్యారు. అయితే.. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నాటికి నియోజకవర్గ పరిధిలోని నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తోంది. ఈ కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని మైనంపల్లి పార్టీని కోరినట్లు వార్తలు వచ్చాయి.

ఓ దశలో ఆయన పేరును ప్రకటిస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే.. ఏమైందో తెలియదు కానీ ఇటీవల ఆ ప్రస్తావన రావడం లేదు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవిని పార్టీ నిరాకరించిందా? దీంతోనే మైనంపల్లి అలిగారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. మధు యాష్కీ మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు