Telangana Elections: పోతే పోనివ్వండి.. పొన్నాల రాజీనామాపై కాంగ్రెస్ రియాక్షన్..

కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) రాజీనామాపై కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పందించారు. పొన్నాల పోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పోతే పోనివ్వండంటూ కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానించారు

Telangana Elections: పోతే పోనివ్వండి.. పొన్నాల రాజీనామాపై కాంగ్రెస్ రియాక్షన్..
New Update

Ponnala Lakshmaiah Resign to Congress: కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) రాజీనామాపై కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పందించారు. పొన్నాల పోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పోతే పోనివ్వండంటూ కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానించారు. అయినా పొన్నాలకు టికెట్ రాదని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మురళీధరన్.. అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామన్నారు. ఇదే సమయంలో పొన్నాల లక్ష్మయ్య రాజీనామా అంశంపై స్పందించారు.

ఇదికూడా చదవండి: Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?

కాంగ్రెస్ నుంచి పొన్నాల వెళ్ళటం వల్ల పార్టీకి నష్టమేమీ లేదన్నారు. అసలు ఎవరి రాజీనామాపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అసలు రాజీనామాపై పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలోకి చాలా మంది వచ్చి చేరుతున్నారని, గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయత ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తున్నామని స్పష్టం చేశారు మురళీధరన్. ఇవాల్టి సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయిందన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మరోసారి సమావేశమై మిగతా స్థానాలకు కసరత్తు పూర్తి చేస్తుందన్నారు.

ఇదికూడా చదవండి: భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్

#telangana-elections #telangana-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe