/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Madhu-Goud-Yaskhi-jpg.webp)
Madhu Yaskhi Goud: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కు పెను ప్రమాదం తప్పింది. ఈరోజు ఆలేరు సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆయన ట్విట్టర్ లో తెలిపారు. డ్రైవర్ ముఖేష్ తెలివిగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.
ALSO READ: సీఎం జగన్‌కు ఈసీ బిగ్ షాక్.. డీజీపీపై బదిలీ వేటు
Met with an accident near Alair, my car hit the divider to save the people who were crossing on two wheeler. By God grace no one hurt seriously. Driver Mukesh with his presence of mind averted major accident 🙏🙏 pic.twitter.com/0RISfYlpC9
— Madhu Goud Yaskhi (@MYaskhi) May 5, 2024
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మధు యాష్కీ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. సొంత పార్టీ నేతల వ్యతిరేకేత వల్లే ఆయన ఓటమి చెందారని గాంధీ భవన్ లో ఇప్పటికి టాక్ నడుస్తోంది. కాగా ఎన్నికల సమయంలో మధు యాష్కీ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయడాన్ని వ్యతిరేకించిన స్థానిక కాంగ్రెస్ నేతలు ప్యారాచూట్ లీడర్ మాకు వద్దు అంటూ గాంధీ భవన్ ఎదుట పోస్టర్లు వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన మధు యాష్కీకి మంత్రి పదవి వస్తుందనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచలనలో ఉన్నట్లు సమాచారం.