Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాక్.. ఈడీకి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేత

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీద సొంత పార్టీ నేత కురువ విజయ్‌ కుమార్‌ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్‌ జరిగిందని ఆయన పేర్కొన్నారు.రేవంత్‌ పై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి తెలియజేశారు.

New Update
Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాక్.. ఈడీకి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేత

Revanth Reddy: రేవంత్‌ రెడ్డి కి సొంత పార్టీ నేతనే షాక్‌ ఇచ్చారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్‌ చేశారని ఈడీకి కురువ విజయ్‌ కుమార్‌ (Vijay Kumar) ఈడీ (ED) కి ఫిర్యాదు చేశారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వారితో రాత్రికి రాత్రే బేరం కుదుర్చుకొని టికెట్ల విషయంలో కోట్లాది రూపాయలు తీసుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు.

ఈ కారణాలతో వెంటనే విచారణ జరిపించాలంటూ ఆయన కోరారు. హైదరాబాద్‌ లోని ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ కు అన్ని సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. గద్వాలకు చెందిన కురువ విజయ్‌ కుమార్, బహుదూర్‌పురా నియోజకవర్గానికి చెందిన ఖాలిమ్‌ బాబాలతో పాటు మరి కొంత మంది నేతలు రేవంత్‌ మీద ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

బోగస్ సర్వే ఇచ్చి అధిష్టానాన్ని తప్పు దోవ పట్టించారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) కోసం కొన్ని సంవత్సరాలనుండి నమ్ముకున్న వారిని మోసం చేసారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సీనియర్ లను పక్కన పెడుతున్నాడు అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
సునీల్ కనుగోలు ద్వారా తప్పుడు నివేదికలు తెర మీదికి తెస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటికైనా స్పందించి నిజమైన కార్యకర్తలకు న్యాయం చెయ్యాలని వారు కోరారు.

Also read: శబరిమల వచ్చే వాహనాలకు ప్రత్యేక అలంకరణలు వద్దు!

Advertisment
తాజా కథనాలు