ఖాళీ బొకేతో ప్రియాంక గాంధీని ఆహ్వానించిన కాంగ్రెస్ నాయకులు! కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి మధ్యప్రదేశ్ లో ఓ వింత అనుభవం ఎదురయ్యింది. ఆమెను వేదిక మీదకి కాంగ్రెస్ నాయకులు ఖాళీ బొకే తో స్వాగతం పలికారు. By Bhavana 07 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Priyanka Gandhi: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి మధ్యప్రదేశ్ సభలో ఓ అనుకొని సంఘటన ఎదురయ్యింది. ఆ ఘటన వల్ల అక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆమె ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు. దీంతో వేదిక మీద నవ్వులు విరిశాయి.అసలేం జరిగిందంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ మధ్యప్రదేశ్ లో ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదిక పైకి ఆమె రాగానే ఓ నాయకుడు ఆమెకు బొకే ఇచ్చి స్వాగతం పలికాడు. అయితే ఆ బొకేలో పువ్వులు లేవు (Empty Bouquet). దానిని చూసిన ప్రియాంక గాంధీ పువ్వులు ఏవీ అంటూ గట్టిగా నవ్వేశారు. తన పొరపాటును గ్రహించిన ఆ నాయకుడు నాలుక కరుచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఒప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. Also read: విశాఖ – తిరుపతి రైలులో పొగలు..టపాసుల కలకలం! ఈ నెలాఖరుకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ (Congress) ఈసారి ఎలాగైన గెలుపును సొంతం చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అందులో భాగంగానే ఆమె మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇలా పువ్వులు లేని బొకే ఇవ్వడంతో అక్కడ నవ్వులు విరిసాయి. ఆ తరువాత సభలో ప్రసంగించిన ప్రియాంక తన ప్రసంగం మధ్యలో పుష్ప గుచ్చం గురించి ప్రస్తావించారు. తాను ఇంతకు ముందే ఓ బొకే అందుకున్నానని చెప్పారు.అది అచ్చంగా బీజేపీ (BJP) లీడర్లు ఇస్తున్న హామీల్లాగే… బొకే కూడా ఖాళీగా ఉందని చెప్పడంతో జనం విరగబడి నవ్వారు. ఇండోర్ సభలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేయడంతో అది తెగ వైరల్ గా మారింది. गुलदस्ता घोटाला 😜गुलदस्ते से गुल गायब हो गया.. दस्ता पकड़ा दिया 😂😂मध्यप्रदेश के इंदौर में प्रियंका वाड्रा की रैली में एक कांग्रेसी गुलदस्ता देने पहुंचा लेकिन कांग्रेसी खेल हो गया।#MPElections2023 pic.twitter.com/y7Qmyldp94— Rakesh Tripathi (@rakeshbjpup) November 6, 2023 Also read: మహారాష్ట్రల్లో దూసుకెళ్తున్న కారు.. 57 సర్పంచ్ లు గులాబీ కే! #priyanka-gandhi #national #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి