TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!

కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
New Update

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి (Congress Party) భారీ షాక్ తగిలింది. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన నేతగా పేరు ఉన్న ఎర్ర శేఖర్ ఆ పార్టీని వీడారు. కేటీఆర్ (KTR) సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) చేరి పోయారు. ఇప్పటినుంచి సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో పని చేస్తానని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ ప్రకటించారు. ఎర్ర శేఖర్ గతంలో జడ్చర్ల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్చర్ల టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి ఆసమయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది.

ఇది కూడా చదవండి: TS Politics: బీజేపీకి మరో బిగ్ షాక్.. ఫామ్​హౌస్​లో వివేక్, రేవంత్ రెడ్డి చర్చలు?

అయితే.. ప్రస్తుతం టికెట్ కోసం ఎర్ర శేఖర్, అనిరుధ్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ జరిగింది. కానీ చివరికి అనిరుధ్ కే టికెట్ కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో ఎర్ర శేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న తన అనుచులతో ఆయన సమావేశం అయ్యారు. తాజాగా పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ లో చేరారు. సొంత జిల్లా మహబూబ్ నగర్ లో కీలక నేత పార్టీ వీడడం రేవంత్ రెడ్డి వర్గానికి షాక్ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: Telangana Congress: టీ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాలలు.. పలువురు నేతల రాజీనామా.. రెబెల్‌గా బరిలోకి..

ఇదే జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. నాగర్ కర్నూల్ టికెట్ ను ఇవ్వకపోవడంతో నాగం జనార్దన్ రెడ్డి పార్టీపై ఈవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఆయన పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

#congress-party #telangana-elections-2023 #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe