Rahul Gandhi: ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఎన్నికల తర్వాత తొలిసారిగా సీడబ్ల్యూసీ నేతల భేటీ కానుంది. ఈ సమావేశంలో రాహుల్‌కు కీలక బాధ్యతలను కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించనుంది. రాహుల్‌గాంధీని ప్రతిపక్షనేతగా ప్రతిపాదించే తీర్మానం చేయనుంది. అలాగే పలు రాజకీయ అంశాలపై కూడా తీర్మానాలు చేయనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు సోనియాగాంధీతో రేవంత్ సమావేశం అయ్యారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ఢిల్లీ బాట పట్టారు. కొత్త ఎంపికైన సభ్యులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించి, వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read: