TS Congress Second List: దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. ఆలస్యానికి కారణమిదే?

తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ దసరా తర్వాతనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన అన్ని స్థానాలకు ఒకే సారి అభ్యర్థులను ఖరారు చేయాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులతో అధిష్టానం నేరుగా మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే లిస్ట్ ఆలస్యమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

New Update
Telangana: కాంగ్రెస్‌ ఫైనల్‌ లిస్ట్‌? జాబితాలో 17 మంది పేర్లు.. పలువురి పేర్లు మిస్సింగ్‌!

తెలంగాణ కాంగ్రెస్‌ సెకండ్‌ లిస్ట్‌ (TS Congress Second List) మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల రెండో జాబితాపై సుదీర్ఘ కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దసరా (Dasara) తర్వాతే రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలి జాబితా తర్వాత అసంతృప్తులతో హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తోంది. సీఈసీ మీటింగ్‌ తర్వాతే రెండో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రెండో జాబితాలో మిగిలిన అన్ని స్థానాలకూ ఒకే సారి అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించి అధిష్టానం నేరుగా చర్చిస్తోంది. సెకండ్ లిస్ట్ లో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మాణిక్‌రావ్‌ ఠాక్రే తెలిపారు. కమ్యూనిస్ట్‌ పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి:BJP MLA Candidates: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల.. కేసీఆర్ పై పోటీ చేసేది ఎవరంటే..

ఏది ఏమైనా.. వచ్చే వారంలో కాంగ్రెస్ పూర్తి లిస్ట్ విడుదల చేసి పూర్తి స్థాయి ప్రచరాన్ని ప్రారంభించాలన్నది హస్తం పార్టీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఫస్ట్ లిస్ట్ విడుదల తర్వాత చాలా మంది నేతలు నేరుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో కొందరు పార్టీ కూడా మారిపోయారు. ఈ నేపథ్యంలో సెకండ్ లిస్ట్ విడుదల తర్వాత ఇలాంటి పరిస్థితి ఉండకూడదన్న ఆలోచనతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు.

ఇందులో భాగంగా టికెట్ ఆశిస్తున్న వారితో ముందుగా చర్చించి ఏకాభిప్రాయం తీసుకురావడం లేదా ఒప్పించడం చేస్తున్నారు. టికెట్ వారికి ఎందుకు ఇవ్వడం లేదో వివరిస్తూ.. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను వారికే అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు లేదా, ఎమ్మెల్సీ అవకాశాలను ఇస్తామని బుజ్జగిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్రక్రియ ముగియడానికి మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు