ఈ నెల 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (TS Assembly Elections Results) విడుదలైన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించింది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ ముఖ్యమంత్రి గా కొడంగల్ ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేరును ప్రకటించింది. ఎల్లుండి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీనియర్లందరికీ న్యాయం చేస్తామన్నారు. సీఎల్పీ నేతను ఎన్నుకునే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడికి అప్పగిస్తూ సీఎల్పీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ను సీఎల్పీ నేతగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దీంతో సీఎంగా రేవంత్ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇది కూడా చదవండి:
Big Breaking: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఈ నెల 7న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. సీనియర్లకు న్యాయం జరుగుతుందని.. అంతా కలిసి టీమ్ గా పని చేస్తారన్నారు.
Translate this News: