/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Harish-Rao-jpg.webp)
Harish Rao: ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణాలపై కాంగ్రెస్ అవగాహన లేకుండా మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు. టీమ్స్ ఆస్పత్రుల పట్ల మంత్రి కోమటిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు. టీమ్స్ ఎల్బీనగర్ ఆస్పత్రి జీ+ 14 అయితే, 27 అంతస్తులని మాట్లాడటం అవగాహన రాహిత్యం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆస్పత్రులు ఎందుకు కనిపించడం లేదని విమర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలని అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు విషం చిమ్మడం బాధాకరం.
జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ గారి ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్… pic.twitter.com/EKDm5vw7IO— Harish Rao Thanneeru (@BRSHarish) May 24, 2024