Telangana Congress: పొంగులేటికి కాంగ్రెస్ బిగ్ షాక్! ఆస్థానంలో పోటీకి ఊహించని నేత..!

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో విడత జాబితాలో ఊహించని మార్పులు, చేర్పులు చేశారని సమాచారం. ఈ లిస్ట్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య పేరు రావడం కష్టంగానే కనిపిస్తోందంటున్నారు పార్టీ శ్రేణులు. కాగా, కోరం కనకయ్య ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

New Update
Telangana Congress: పొంగులేటికి కాంగ్రెస్ బిగ్ షాక్! ఆస్థానంలో పోటీకి ఊహించని నేత..!

Telangana Elections: తెలంగాణలో ఓవైపు ఎన్నికలు సమీపిస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్(Congress) పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపిక వద్దే ఉండిపోయింది. ఎలాగోలా మొదటి విడత అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. రెండవ విడత అభ్యర్థుల ఖరారు విషయంలోనే తర్జన భర్జన పడుతోంది. అయితే, సెకండ్ లిస్ట్ ఆలస్యానికి ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపేనని తెలుస్తోంది. ఇక్కడ ప్రధాన నేతలంతా తమ తమ అనుచరులకే టికెట్లు కేటాయించాలని పట్టుబట్టడం.. అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.

అయితే, జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో విడత జాబితాలో ఊహించని మార్పులు, చేర్పులు చేసిందట కాంగ్రెస్. ఈ లిస్ట్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జెడ్పీచైర్మన్ కోరం కనకయ్యకు సీటు ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. కోరం కనకయ్య ఇల్లందు అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయనకు సీటు కన్ఫామ్‌ అయ్యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు పార్టీ నాయకులు. కనకయ్య అభ్యర్థిత్వంపై అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట. కనకయ్యకు టికెట్ కేటాయించొద్దంటూ మూడు రోజులుగా ఏఐసీసీ ఎదుట ఇల్లందు కాంగ్రెస్ ఆశావాహుల ఆందోళన చేపట్టారు. దాంతో అధిష్టానం పునరాలోచనలో పడిందట.

ఇదికూడా చదవండి: పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

కనకయ్య అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడానికి అదొక కారణం అయితే.. మరోవైపు ఇల్లందు టికెట్ రేసులోకి అనూహ్యంగా కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మాజీ మంత్రి బలరాం నాయక్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో విడత జాబితాలో బలరాం నాయక్‌కు ఇల్లందు సీటును కన్ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

కాగా, ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం మొత్తం 32 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సీటు కోసం పట్టుబడుతున్నారు. తన అనుచరుడైన కోరం కనకయ్యకే ఈ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు పొంగులేటి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఇల్లందు సీటును ఎవరికి కేటాయిస్తుందో తెలియాలంటే.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.

ఇదికూడా చదవండి:ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

Advertisment
తాజా కథనాలు