Rahul Gandhi:: కాంగ్రెస్ తొలి జాబితా.. రాహుల్ గాంధీ పోటీ చేసేది అక్కడి నుంచే!

లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 39 మందితో ఫస్ట్ లిస్టును విడుదల చేసింది. మొదటి జాబితాలో రాహుల్ గాంధీ పేరు కూడా ఉంది.ఆయన వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు.

New Update
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ!

Rahul Gandhi: లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 39 మందితో ఫస్ట్ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో 15 స్థానాల్లో జనరల్ క్యాటగిరి అభ్యర్థులు..  మిగితా 24 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అభ్యర్థులకు టికెట్ కేటాయించింది. అయితే.. మొదటి జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరు కూడా ఉంది. ఆయన మరోసారి వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు.

ALSO READ: మార్చి 11న బీజేపీ రెండో జాబితా?

తెలంగాణ నుంచి పోటీకి నో..!

గత కొంత కాలంగా రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన తొలి జాబితాలో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనున్నట్లు ఉంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి ఎంపీ గా పోటీ చేస్తారనే ప్రచారానికి చెక్ పడింది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలనీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల డిమాండ్ ను పరిశీలిస్తున్న హైకమాండ్ రెండు స్థానాల్లో రాహుల్ గాంధీని పోటీలో ఉంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ గాంధీ ఖమ్మం పోటీ నుంచి తప్పుకుంటే ప్రియాంక గాంధీని బరిలో దించాలని కాంగ్రెస్ పెద్దలు చర్చిస్తున్నట్లు  తెలుస్తోంది.

ఈ నెల 11న రెండో జాబితా...

39 మందితో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ రెండో జాబితా అభ్యర్థుల ఎంపిక పై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న మరోసారి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. రెండో జాబితా అభ్యర్థులపై చర్చించనున్నారు. అదే రోజున రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుందని సమాచారం. అయితే.. మొదటి లిస్టులో పేరు రాలేదని భంగపడ్డ నేతలు రెండో జాబితాపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ నుంచి మొదటి జాబితాలో 5 మందిని ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం రెండో జాబితాలో ఆరుగురిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

* కరీంనగర్- ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి,
* నిజామాబాద్ – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,
* పెద్దపల్లి – గడ్డం వంశీ
* చేవెళ్ల – సునీతా మహేందర్‌ రెడ్డి,
* సికింద్రాబాద్ – బొంతు రామ్మోహన్
* నాగర్ కర్నూల్ - సంపత్/ మల్లు రవి

Advertisment
Advertisment
తాజా కథనాలు