YS Sharmila: తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్‌: షర్మిల

తిరుపతి వేదికగా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ ప్రకటిస్తామన్నారు APCC ఛీఫ్ వైఎస్‌ షర్మిల. పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల వెల్లడించారు.

New Update
YS Sharmila: ఏపీ సీఎం జగన్ పై దాడి దురదృష్టకరం..వైఎస్ షర్మిల ట్వీట్..!

Congress Declaration: ప్రత్యేక హోదాపై తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా డిక్లరేషన్ ఇస్తామని తెలిపారు ఏపీసీసీ ఛీఫ్ వైఎస్‌ షర్మిల. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాపై జగన్ సర్కార్ కేవలం మాటలు మాత్రమే చెబుతున్నారని..కానీ కాంగ్రెస్ చేతల్లో చూపిస్తుందని వ్యాఖ్యానించారు.

Also Read: క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ!

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై కూడా ధ్వజమెత్తారు. ఏపీని హార్డ్ వేర్ హబ్‌గా మారుస్తామని.. చమురు రిఫైనరీలు ఇస్తామని ప్రధాని మోదీ చెప్పారన్నారు. వాటిలో ఏ  ఒక్కమాటా నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. పదేళ్లుగా ఏపీ ప్రజలను బీజేపీ మోసం చేస్తూనే వస్తుందన్నారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయని.. తద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.

Also Read: చంద్రబాబు ఆసక్తికర ట్వీట్.. భువనేశ్వరి రియాక్షన్ చూడండి..!

ఏపీకి మాత్రం కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు దొరక్క యువత ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని వాపోయారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతోందని..జగన్ సర్కార్ మెగా డీఎస్సీ అని దగా చేశారని నిప్పులు చెరిగారు. జాబ్ క్యాలెండర్‌ అని చెప్పిన సీఎం జగన్‌.. యువతను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని షర్మిల వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు