Telangana Polling: ఆ ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగింది.. మళ్లీ పోలింగ్ నిర్వహించాలి..

హైదరాబాద్‌లోని పాతబస్తీలో రిగ్గింగ్ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. చంద్రయాణగుట్ట, చార్మినర్, బహదూర్‌పుర స్థానాల్లో రిగ్గింగి జరిగిందని.. కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మళ్లీ ఆ స్థానాల్లో పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.

New Update
Elections : నోటాకు ఓటు వేయాలంటూ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రచారం!

హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో చంద్రయాణగుట్ట, చార్మినర్, బహదూర్‌పుర స్థానాల్లో రిగ్గింగి జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ ఛైర్మన్ నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. MIM పార్టీ కార్యకర్తలు రిగ్గింగ్ చేశారని.. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పరిశీలించాలని కోరారు. రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ నిన్న అసెంబ్లీ ఎన్నికలు ముగియగా.. రాత్రి నాటికి 70.66 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

Also Read: అర్థరాత్రి వరకు పోలింగ్.. తెలంగాణ ఓటింగ్ శాతం ఎంతంటే..

Advertisment
తాజా కథనాలు