Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారని అన్నారు. గెలిచాక మోసం చేశారని పేరొన్నారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదని అన్నారు. హామీలను అమలు చేయకుండా మొద్దనిద్రపోతున్న కాంగ్రెస్‌ను తట్టి లేపాలంటే ఆ పార్టీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు.
అధికారంలోకి వచ్చి ఆరు నెలలై ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదని విమర్శించారు. జాబ్ కాలెండర్ లేదు.. 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేసేది ఇలాగేనా? అని నిలదీశారు. నిరుద్యోగులకు 4 వేల భృతి, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, అమ్మాయిలకు ఉచిత స్కూటీ.. ఒక్క హామీ అమలు కాలేదని అన్నారు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగులో ఉన్నాయని... డీఏపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి మాటమీద నిలబడలేదని అన్నారు.