Telangana Congress Rajya Sabha Members: రేపటితో రాజ్యసభ ఎన్నికలకు (Rajya Sabha Elections) నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ క్రమంలో రాజ్య సభ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది కాంగ్రెస్ (Congress) అధిష్టానం. తాజాగా తెలంగాణ, కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. రాజ్య సభకు తెలంగాణ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి (Renuka Chowdhury), అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) లకు రాజ్య సభ టికెట్ కేటాయించింది. కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నజీర్ హుస్సేన్, జీ.సీ. చంద్రశేఖర్ పేర్లను ఫైనల్ చేసింది. అలాగే మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ పెరును ప్రకటించింది. రేపు వీరు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయనున్నారు.
ALSO READ: ఢిల్లీ సీఎంకు మరోసారి ఈడీ నోటీసులు
రేణుక చౌదరికి గుర్తింపు...
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరికి కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ టికెట్ కేటాయించింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి బెంగపడ్డారు రేణుక. ఆ తరువాత ఎమ్మెల్సీలో నైనా తనకు అవకాశం కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుందని భావించిన ఆమెకు నిరాశే ఎదురైంది. అయితే.. ఇటీవల రేణుక చౌదరి ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. ఖమ్మం ఎంపీ టికెట్ ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి దరఖాస్తు చేసుకుంది. తాజాగా ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తుంచిన కాంగ్రెస్ హైకమాండ్ రేణుక చౌదరికి రాజ్య సభ టికెట్ ఇచ్చింది. రేపు ఆమె నామినేషన్ వేయనున్నారు.
రేణుక చౌదరికి రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో కాంపిటేషన్ తగ్గింది. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు.. తాజాగా ఈ పోటీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు ఎంపీ టికెట్ పోటీలో ఉన్నారు. మరి వీరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో మరి కొన్ని ఈరోజుల్లో తేలనుంది.