Congress First List: దేశంలో బీజేపీని గద్దె దించి మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ 195 మందితో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్చలు అనంతరం మొదటగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను ప్రకటించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఛత్తీస్ గఢ్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, లక్షద్వీప్ రాష్ట్రాల్లో నుంచి పోటీ చేసే 39 మంది అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది. అయితే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూటమిలోని ఇతర పార్టీలతో చర్చించి మిగతా అభ్యర్థులను త్వరలో ప్రకటించనుంది.
ALSO READ: బీఆర్ఎస్‌కు మరో షాక్… బీజేపీలోకి మాజీ ఎంపీ!
ఏ రాష్ట్రంలో ఎంతమంది..?
* ఛత్తీస్ గఢ్ - 06
* కేరళ - 15
* కర్ణాటక - 08
* తెలంగాణ - 04
* నాగాలాండ్ - 01
* మేఘాలయ - 02
* సిక్కిం - 01
* త్రిపుర - 01
* లక్షద్వీప్ -01
అనుకున్నది తొమ్మిది.. ప్రకటించింది ఐదే...
తెలంగాణలో లోక్ సబ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణలో తొమ్మిది మందితో తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటిస్తుందని అనుకోగా.. కేవలం ఐదుగురితో తొలి జాబితాను విడుదల చేసింది.
ఆ నలుగురు వీరే...
* జహీరాబాద్- సురేష్ షెట్కర్
* నల్గొండ - జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి
* మహబూబాబాద్- బలరాం నాయక్
* మహబూబ్ నగర్ - వంశీచంద్ రెడ్డి